నాంది, ఉప్పెన, జాంబీరెడ్డి వంటి వరుస హిట్ చిత్రాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఈ తరుణంలో ‘చెక్’ అంటూ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు కల్ట్ బోయ్ నితిన్. ఈ యంగ్ హీరో నితిన్‌కి వీరాభిమాని కావడంతో ప్రతి సినిమాకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సపోర్ట్ ఉండనే ఉంటుంది. ఈ సినిమాకి ట్వీట్‌లతో హీటెక్కిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. నితిన్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా నితిన్ ‘చెక్’ సినిమాకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేయడం.. రాజమౌళి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరుకావడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇంతకీ ఈ సినిమా టాక్ ఏంటి?? యూఎస్ ప్రీమియర్ టాక్ ఎలా ఉంది? ట్విట్టర్‌లో ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటో చూద్దాం.
ఫస్టాఫ్ రిపోర్ట్..
చెక్ సినిమా ఫస్టాఫ్ కొన్ని ఆసక్తికరమైన సన్నివేషాలతో బాగుంది. అలాగే బోరింగ్ సీన్లు కూడా ఉన్నాయి. ప్రధాన సమస్య ఏంటంటే.. భావోద్వేగంతోనే కథకు కనెక్ట్ కావడం.
ఫస్టాఫ్ చాలా డేసెంట్‌గా ఉంది.. కాస్త లాగ్ ఎక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తుంది.
క్లైమాక్స్ ఈ సినిమాకి ప్రధాన హైలైట్..
స్క్రీన్ ప్లే, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది