ప్రకటనలు
హోమ్ / వార్తలు / ఇండియా న్యూస్ / Kishan Reddy: కేంద్ర కేబినెట్ మంత్రిగా హిందీలో ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి..

Kishan Reddy: కేంద్ర కేబినెట్ మంత్రిగా హిందీలో ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి..

కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం (ఇప్పుడు.. అప్పుడు)

కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం (ఇప్పుడు.. అప్పుడు)

కేంద్ర కేబినెట్ మంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. ఆయన హిందీలో ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో కొనసాగుతున్న కిషన్ రెడ్డికి ప్రమోషన్ లభించింది.

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ మంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అయితే.. ఆయన హిందీలో ప్రమాణ స్వీకారం చేయడం గమనార్హం. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో కొనసాగుతున్న కిషన్ రెడ్డికి ప్రమోషన్ లభించింది. ప్రస్తుతం కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా ఉన్నారు. తాజాగా ఆయనకు కేబినెట్ మంత్రి హోదా దక్కింది. సహాయ మంత్రి అయిన సందర్భంలో మే 30న ప్రమాణస్వీకారం చేసిన కిషన్ రెడ్డి, కేబినెట్ మంత్రిగా జూలై 7న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు హిందీలో ప్రమాణ స్వీకారం చేయడానికి తడబడి కాస్త ఇబ్బందిపడిన కిషన్ రెడ్డి, ఇప్పుడు ఎలాంటి తడబాటు, తత్తరబాటు లేకుండా స్పష్టంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం కేంద్ర కార్మికశాఖ మంత్రి(స్వతంత్ర హోదా)గా ఉన్న సంతోష్ గాంగ్వార్ తన పదవికి రాజీనామా చేయడంతో కార్మిక శాఖ కిషన్ రెడ్డికి దక్కే అవకాశం లేకపోలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ప్రకటనలు

గతంలో తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్‌లో ప్రాతినిథ్యం వహించిన బండారు దత్తాత్రేయకు స్వతంత్ర్య హోదాతో కూడిన కార్మిక శాఖను కేటాయించారు. దీంతో మరోసారి కిషన్ రెడ్డికి కూడా ఆ శాఖనే కేటాయిస్తారా లేక మరో శాఖను అప్పగిస్తారా అన్నది చూడాల్సి ఉంది.

కేంద్ర కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన కిషన్ రెడ్డి పొలిటికల్ ప్రొఫైల్‌ను ఒక్కసారి పరిశీలిస్తే.. కిషన్‌రెడ్డి పూర్తి పేరు గంగాపురం కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో ఏపీ అసెంబ్లీలో బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఆయన వ్యవహరించారు. అంతేకాదు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కూడా ఆయన పార్టీకి సేవలందించారు. 1980లో జనతా పార్టీ యువ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి అంచలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చాకు కోశాధికారిగా కూడా ఆయన పనిచేశారు. 2002 నుంచి 2005 వరకూ భారతీయ జనతా యువ మోర్చాకు జాతీయ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. 2004లో హిమాయత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 నుంచి 2009 వరకూ హిమాయత్‌నగర్ ఎమ్మెల్యేగా ఉన్న జి.కిషన్ రెడ్డి 2012లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా 22 రోజుల ‘పోరు యాత్ర’ చేసి 3,500 కిలోమీటర్లు.. 88 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. 986 గ్రామాల్లో పర్యటించారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18‌లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి..
  • First Published :
ప్రకటనలు
ప్రకటనలు