అన్వేషించండి
×
Top
Bottom

Ram Charan Daughter Name : మెగా మనవరాలికి పేరు పెట్టేశారోచ్ - రామ్ చరణ్, ఉపాసన కుమార్తె పేరు ఏమిటంటే?

మెగాస్టార్ చిరంజీవి మనవరాలు... రామ్ చరణ్, ఉపాసన దంపతుల అమ్మాయికి పేరు పెట్టేశారు. ఆ పేరు ఏమిటంటే?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉపాసన కొణిదెల (Upasana Konidela) దంపతులు పది రోజుల క్రితం తల్లిదండ్రులు అయ్యారు. ఈ సంగతి అందరికీ తెలుసు. మెగాస్టార్ ఇంట మహాలక్ష్మి అడుగు పెట్టిందని అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కొణిదెల, కామినేని కుటుంబాలు చిన్నారి రాకతో సంతోషంలో మునిగాయి. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ రోజు ఆ అమ్మాయికి పేరు పెట్టారు. 

కొణిదెల వారి అమ్మాయి పేరు క్లీంకార!
మెగా మనవరాలికి క్లీంకార కొణిదెల అని పేరు పెట్టినట్లు చిరంజీవి ట్వీట్ చేశారు. లలిత సహస్ర నామం నుంచి పేరు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 

''క్లీంకార పేరు ప్రకృతి స్వరూపాన్ని సూచిస్తుంది. అమ్మవారి 'శక్తి'ని నిక్షిప్తం చేస్తుంది. ఆ పేరులో శక్తివంతమైన వైబ్రేషన్ ఉంది. మా చిన్నారి పెరిగి పెద్ద అయ్యే కొలదీ ఆ లక్షణాలను పుణికి పుచ్చుకుంటుందని, తనలో నిక్షిప్తం చేసుకుంటుందని నమ్ముతున్నాను'' అని చిరంజీవి పేర్కొన్నారు. ఇంగ్లీష్ పరంగా చూస్తే... Klin Kara అని చిరంజీవి పదాల మధ్య గాప్ ఇచ్చారు. దాంతో క్లిన్, కార అని కొందరు పలుకుతున్నారు.

మనవరాలిని ఉయ్యాలలో వేసిన మెగాస్టార్!
రామ్ చరణ్, ఉపాసన దంపతుల బిడ్డకు 'మెగా ప్రిన్సెస్' అని ఆల్రెడీ అభిమానులు ముద్దుగా పిలవడం మొదలుపెట్టారు. ఈ రోజు మెగా ప్రిన్సెస్ కోసం ఓ ఫంక్షన్ చేశారు. మనవరాలిని మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలలో వేస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాసన తల్లిదండ్రులు... అనగా వియ్యంకుల వారితో కలిసి దిగిన ఫోటోను చిరంజీవి షేర్ చేశారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

సాధారణంగా చిన్నారి పుట్టిన 21వ రోజున బారసాల వేడుక చేస్తారు. ఆ రోజు బిడ్డను ఉయ్యాలలో వేయడం, పేరు పెట్టడం (నామకరణం) చేస్తారు. చిరు మనవరాలు జన్మించి పది రోజులు మాత్రమే అయ్యింది. ఈ రోజు అమ్మాయికి నామకరణం చేశారు. 

Also Read : 'లస్ట్ స్టోరీస్ 2' రివ్యూ : తమన్నా బోల్డ్‌గా చేశారు సరే సిరీస్‌ ఎలా ఉంది? శృంగారం గురించి కొత్తగా ఏం చెప్పారు?

పేరు ఎప్పుడో పెట్టేశారు... ప్రజలకు ఇప్పుడు చెప్పారు!
అపోలో ఆస్పత్రిలో ఉపాసన డెలివరీ జరిగింది. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్ళే ముందు రామ్ చరణ్, ఉపాసన దంపతులు పాపతో సహా మీడియా ముందుకు వచ్చారు. పాప ముఖాన్ని కనపడకుండా జాగ్రత్త పడ్డారు. అప్పుడు పాపకు ఆల్రెడీ పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చారు. నామకరణం రోజున పేరును చెబుతామని రామ్ చరణ్ తెలిపారు. 'పాపది ఎవరి పోలిక?' అని ప్రశ్నించగా... ''నాన్నలా ఉంది'' అని చెప్పారు. 

మనవరాలి రాకతో ఆనందంలో మెగాస్టార్!
రామ్ చరణ్, ఉపాసన దంపతులకు బిడ్డ జన్మించిన రోజున మెగాస్టార్ చిరంజీవి మీడియా ముందుకు వచ్చారు. ఆయన ఆంజనేయ స్వామి భక్తుడు అనేది అందరికీ తెలిసిన విషయమే. హనుమంతునికి ప్రీతికరమైన రోజు మంగళవారం. ఆ రోజు అమ్మాయి పుట్టడంతో మెగాస్టార్ మరింత సంబరపడ్డారు. తన ఆనందం వ్యక్తం చేశారు. రామ్ చరణ్ విజయాలు, వరుణ్ తేజ్ నిశ్చితార్థం, మనవరాలు పుట్టడం... తమ ఇంట అన్నీ శుభకార్యాలు జరుగుతున్నాయని తెలిపారు.    

Also Read 'మాయా పేటిక' రివ్యూ : ఒక్క టికెట్ మీద ఆరు షోలు - సెల్ ఫోన్ బయోపిక్ ఎలా ఉందంటే?

'ఆర్ఆర్ఆర్'తో గత ఏడాది భారీ విజయం అందుకోవడం మాత్రమే కాదు, గ్లోబల్ ఆడియన్స్ కాంప్లిమెంట్స్ అందుకున్న రామ్ చరణ్... సౌత్ ఇండియన్ స్టార్ దర్శకుడు శంకర్, అగ్ర నిర్మాత 'దిల్' రాజుతో 'గేమ్ ఛేంజర్' చేస్తున్నారు. ఇప్పుడీ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇది పాన్ ఇండియా సినిమా. దీని తర్వాత 'ఉప్పెన' ఫేమ్ సానా బుచ్చిబాబు దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా చేయనున్నారు. కన్నడ దర్శకులు ప్రశాంత్ నీల్, నర్తన్ దర్శకత్వంలో కూడా ఆయన సినిమాలు చేసే అవకాశం ఉంది. చర్చలు జరుగుతున్నాయి. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Formation Day: గవర్నర్‌ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ సమావేశం- తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం
గవర్నర్‌ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ సమావేశం- తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం
Lok Sabha Election 2024: పోలింగ్‌బూత్‌పై మూకదాడి, ఈవీఎమ్ ఎత్తుకెళ్లి చెరువులో పడేసిన దుండగులు
Lok Sabha Election 2024: పోలింగ్‌బూత్‌పై మూకదాడి, ఈవీఎమ్ ఎత్తుకెళ్లి చెరువులో పడేసిన దుండగులు
Exit Poll Results 2024: ఎగ్జిట్‌పోల్స్‌పై పెరుగుతున్న అంచానాలు, గత ఎన్నికల్లో ఏ సంస్థల అంచనాలు నిజమయ్యాయి
ఎగ్జిట్‌పోల్స్‌పై పెరుగుతున్న అంచానాలు, గత ఎన్నికల్లో ఏ సంస్థల అంచనాలు నిజమయ్యాయి
Jagan Tour Update: ముగిసిన ముఖ్యమంత్రి లండన్ టూర్‌- రాష్ట్రానికి వచ్చిన జగన్‌కు ఘన స్వాగతం
ముగిసిన ముఖ్యమంత్రి లండన్ టూర్‌- రాష్ట్రానికి వచ్చిన జగన్‌కు ఘన స్వాగతం
Advertisement
Advertisement
Advertisement
metaverse

వీడియోలు

Drop in Pitches in T20 World Cup 2024 | డ్రాప్ ఇన్ పిచ్‌లపై జరగనున్న టీ20 వరల్డ్ కప్Ancient Anjaneya Swamy Temple in Tirupati | 1422 నాటి ఆంజనేయస్వామి, ఒంటె వాహన ఆలయంT20 World Cup Records That Are in Danger | టీ20 ప్రపంచకప్‌లో బద్దలయ్యే రికార్డులుKondagattu Hanuman Temple | కొండగట్టు హనుమంతుడికి రెండు పుట్టినరోజులు ఎందుకో తెలుసా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Formation Day: గవర్నర్‌ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ సమావేశం- తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం
గవర్నర్‌ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ సమావేశం- తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం
Lok Sabha Election 2024: పోలింగ్‌బూత్‌పై మూకదాడి, ఈవీఎమ్ ఎత్తుకెళ్లి చెరువులో పడేసిన దుండగులు
Lok Sabha Election 2024: పోలింగ్‌బూత్‌పై మూకదాడి, ఈవీఎమ్ ఎత్తుకెళ్లి చెరువులో పడేసిన దుండగులు
Exit Poll Results 2024: ఎగ్జిట్‌పోల్స్‌పై పెరుగుతున్న అంచానాలు, గత ఎన్నికల్లో ఏ సంస్థల అంచనాలు నిజమయ్యాయి
ఎగ్జిట్‌పోల్స్‌పై పెరుగుతున్న అంచానాలు, గత ఎన్నికల్లో ఏ సంస్థల అంచనాలు నిజమయ్యాయి
Jagan Tour Update: ముగిసిన ముఖ్యమంత్రి లండన్ టూర్‌- రాష్ట్రానికి వచ్చిన జగన్‌కు ఘన స్వాగతం
ముగిసిన ముఖ్యమంత్రి లండన్ టూర్‌- రాష్ట్రానికి వచ్చిన జగన్‌కు ఘన స్వాగతం
Telangana Weather Update: తెలంగాణలో భానుడి భగభగలు, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదు, నేటి నుంచి తగ్గే అవకాశం
తెలంగాణలో భానుడి భగభగలు, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతల నమోదు, నేటి నుంచి తగ్గే అవకాశం
Exit polls tension: ఫలితాల కంటే ముందే ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ - ఆసక్తిగా ఎదురు చూస్తున్న జనం
ఫలితాల కంటే ముందే ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ - ఆసక్తిగా ఎదురు చూస్తున్న జనం
Gas Price: మూడో నెలలోనూ తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర - మీ ప్రాంతంలో కొత్త రేటు ఇది
మూడో నెలలోనూ తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధర - మీ ప్రాంతంలో కొత్త రేటు ఇది
Hanuman Janmotsav 2024: కొండగట్టు భక్తజన సంద్రం- కాషాయ వర్ణంతో మెరిపోతున్న అంజన్న సన్నిధి
కొండగట్టు భక్తజన సంద్రం- కాషాయ వర్ణంతో మెరిపోతున్న అంజన్న సన్నిధి
Embed widget